సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (21:54 IST)

పెళ్లి రహస్యంగా చేసుకునేది లేదు.. విక్కీ ఆ స్టేజ్ దాటేశాడు.. నయనతార

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. విఘ్నేష్‌తో తన పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటున్నానని ఫ్యాన్స్‌కి చెప్పారు.  తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను చూపిస్తూ.. విఘ్నేష్ శివన్ కుటుంబ సభ్యులు, తన కుటుంబ సభ్యులు మాత్రమే నిశ్చితార్ధానికి హాజరయ్యారని చెప్పింది. 
 
పెద్ద హడావిడిగా సంబరాలు చేసుకోవడం తనకు నచ్చదని.. అందుకే సింపుల్‌గా ఫ్యామిలీ మధ్య ఎంగేజ్మెంట్ వేడుక జరిగిందని తెలిపింది. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదని.. త్వరలోనే ఉంటుందని .. ముహుర్తాలు కుదిరిన తరువాత చెబుతానని వెల్లడించింది. అభిమానులకు సమాచారం ఇస్తానని.. రహస్యంగా మాత్రం పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది.
 
విఘ్నేష్ తనకు కాబోయే భర్త అని.. బాయ్ ఫ్రెండ్ స్టేజ్ ఎప్పుడూ దాటేశాడని చెప్పుకొచ్చింది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయింది. కాబట్టి మీడియా ఫ్రెండ్స్ కూడా ఇకపై అలా రాస్తేనే బాగుంటుందని కోరింది. తన వ్యక్తిగత జీవితంలో ఏదీ దాచుకోలేదని చెబుతోంది.