1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జులై 2025 (12:59 IST)

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

rave party
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన కొండాపూర్‌లో తాజాగా మరో రేవ్ పార్టీ జరిగింది. వారాంతపు సెలవు రోజైన శనివారం రాత్రి ఈ రేవ్ పార్టీ జరిగింది. ఇందులో ఉన్నత శ్రేణి గంజాయితో పాటు వివిధ రకాలైన మత్తు పదార్థాలను ఉపయోగించారు. ముఖ్యంగా 50 ఓజీ కుష్ రకానికి చెందిన గంజాయిని వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శనివారం రాత్రి ఎస్వీ నిలయం అపార్టుమెంట్‌లో కొంతమంది రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎక్సైజ్ శాఖ పోలీసులు ఆ అపార్టుమెంటులో దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. పార్టీ నిర్వాహకుల సహా మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. విజయవాడకు చెదిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు ఏపీ నుంచి సంపన్న యువకులను పిలిచి వీకెండ్‌లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ పోలీసులు తెలిపారు. 
 
అపార్టుమెట్‌లో సోదాలు నిర్వహించగా, 2.8 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల డ్రగ్స్ లభించినట్టు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కింగ్ కెన్ షేర్ రాహుల్, ఆర్గనైజర్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల  సాయికృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతా, తేజ తదితరులు ఉన్నార. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో మరో ముగ్గురు చిక్కకుండా పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.