ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి
దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. పాఠశాల బాత్రూమ్‌లో 14 యేళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితుడుకి వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ నెల 24వ తేదీన పోలీసులకు ఒక పీసీఆర్ కాల్ వచ్చింది. స్కూల్ వాష్ రూమ్‌లో 14 యేళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు కాలర్ సమాచారం అందించాడు. పోలీస్ బృందం వెంటనే స్కూల్‌కు చేరుకుంది. అయితే, అంతకుముందే ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు వారితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
బాధితుడికి కౌన్సిలింగ్ సెషన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. డాక్టర్ నుంచి మెడికో లీగల్ సర్టిఫికేట్ అందిన తర్వాత బాలుడుపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించి, నిందితుడుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.