శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (14:31 IST)

చిరంజీవికి చెల్లెలుగా, సత్యదేవ్‌కి భార్యగా నయనతార

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ 'లూసిఫర్' రీమేక్. ఇందులో సత్యదేవ్ విలన్ గా కనిపించబోతున్నాడు. మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్'ను తెలుగులో మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒరిజినల్ లో వివేక్ ఓబరాయ్ పోషించిన పాత్రనే సత్యదేవ్ చేస్తున్నాడు. ఇక ఆయనకు జోడీగా దక్షిణాది సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతోందట. 
 
నయన్ ఇందులో చిరంజీవికి చెల్లెలుగా, సత్యదేవ్‌కి భార్యగా కనిపించనుంది. చిరుకు విలన్ అంటేనే పెద్ద న్యూస్ అనుకుంటుంటే ఇక నయన్ జతగా నటించనుండటం సత్యదేవ్‌కు విశేషమని చెప్పాలి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తాడని అన్నారు. 
 
కానీ అది నిజం కాదని తేలింది. ఆ పాత్రలో మరో స్టార్ హీరో కనిపిస్తాడని సమాచారం. ఒరిజినల్ లో వివేక్ ఓబరాయ్ పోషించిన పాత్రనే సత్యదేవ్ చేస్తున్నాడు. సో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సత్యదేవ్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనే చెప్పాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ.