శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:25 IST)

కోవిడ్ నిధి సేక‌ర‌ణ‌- అంత‌ర్జాతీయ స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi
క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతు సేవ‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి వేవ్ స‌మ‌యంలో సినీకార్మికుల‌కు క‌ష్టంలో ఉన్న‌వారికి సాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాను చేప‌ట్టి ప్రాణ దాత అయ్యారు. అయితే ఈ సేవ‌ల‌కు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కుతోంది. 
 
రిల‌యన్స్ సంస్థ ద్వారా జాతీయ అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు `వియ్ ఫర్ ఇండియా` సంస్థ ద్వారా చారిటీ కార్య‌క్ర‌మం చేసి భార‌త‌దేశంలో కోవిడ్ కి సంబంధించిన ఫండ్ ని రైజ్ చేయాల‌ని ఆగ‌స్టు 15న ఓ ప్ర‌య‌త్నం చేయ‌గా ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. 5 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల నిధిని సేక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్ర‌ఖ్యాత హాలీవుడ్ పోర్ట‌ల్ డెడ్ లైన్ డాట్ కాంలో ప్ర‌ముఖంగా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. 
 
ఇక కోవిడ్ స‌మ‌యంలో తాము చేసిన సేవ‌ల‌కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్య‌మాల లైవ్ వేదిక‌గా చిరు డెమో ఇచ్చారు. ఇలా చేసిన ప్ర‌ముఖుల్లో హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ స‌హా మెగాస్టార్ చిరంజీవి పేరు వైర‌ల్ అయ్యింది. అలాగే ఈ జాబితాలో హృతిక్ రోష‌న్- అజ‌య్ దేవ‌గ‌ణ్‌ త‌దిత‌రులు ఉన్నారు. 
 
ఆగ‌స్టు 15 రాత్రి గ్లోబల్ ఫండ్ రైజర్ `వియ్ ఫర్ ఇండియా` భారతదేశంలో  కోవిడ్ బాధితుల సేవ‌కోసం నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం చేసింది.  ఇది వర్చువల్ ఈవెంట్.. వినాశకరమైన వైరస్ పై దేశ పోరాటానికి సహాయపడటానికి  5మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల‌ను సమీకరించి గొప్ప విజ‌యం సాధించామ‌ని ఫండ్ రైజ‌ర్ సంస్థ ప్ర‌క‌టించింది. దీనికోసం పాపుల‌ర్ స్టార్లు ముందుకు రావ‌డం విశేషం. పశ్చిమ నుండి ప్రముఖ పేర్లతో సహా స్టీవెన్ స్పీల్‌బర్గ్ -మిక్ జాగర్ ప్రత్యేక మద్దతు సందేశాలను అందించారు. దేశంలోని ఒక మంచి కాజ్ కోసం ఇంత‌మంది గ్లోబ‌ల్ స్టార్లు నేను సైతం అంటూ ముందుకు రావ‌డం నిజంగా ఒక అద్భుతం అన్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.