ఆప్ఘన్ వాసుల కోసం ఈ-ఎమర్జెన్సీ వీసా విధానాన్ని అమల్లోకి తెచ్చిన భారత్
ఆప్ఘనిస్థాన్ దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఈ దేశంలో చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఎమర్జెన్సీ వీసా పద్ధతిని ప్రకటించింది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఇండియాలో ఆశ్రయం పొందాలనుకునేవారికి ఆ వీసాలను జారీ చేయనున్నారు.
'e-Emergency X-Misc Visa పేరుతో కేంద్ర హోంశాఖ ఆ వీసాలను జారీ చేయనున్నది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ చేరుకోవాలనుకునేవారికి ఆ వీసా ద్వారా అవకాశం కల్పించనున్నారు. అయితే హిందువులు, సిక్కులకు ఈ-వీసాలో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు'.
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ ఫైటర్లు చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేలాది సంఖ్యలో జనం కాబూల్ విమానాశ్రయానికి వస్తున్న విషయం తెలిసిందే.