1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. dharmapuri sanjay fire on sensational comments on bjp

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

dharmapuri sanjay
భారతీయ జనతా పార్టీపై ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ నోరు పారేసుకున్నారు. బీజేపీని ఒక లంగా పార్టీగా అభివర్ణించారు. ఈ అంశంపై ఆయన శనివారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బీజేపీ అంటేనే ఒక లంగా పార్టీ అన్నారు. 
 
బీజేపీ పార్టీ వాళ్లు సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలలకు ముందే రాష్ట్రంలో మతగొడవలు సృష్టిస్తారన్నారు. ఎన్నడూ లేనిది మా నిజామాబాద్‌లో మత గొడవలు సృష్టిస్తే 50 మంది రోడ్ మీద బట్టలూడదీసి కొట్టిర్రు అర్వింద్‌ను అని అన్నారు. ఆయన తాజాగా చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
'యోగా' అంటే ఏంటి? ఆర్కే బీచ్‌లో ప్రధాని మోడీ చెప్పిన అర్థమిదే.. 
 
ప్రతి యేటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఏపీలోని సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్‌లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ యోగా దినోత్సవం "మానవాళి కోసం యోగా 2.0"కు నాంది పలకాలని, దీనిద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు. 
 
యోగా కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా, ప్రపంచ భాగస్వామ్యానికి మాధ్యమంగా మారాలని, ప్రతి దేశం, సమాజం యోగాను తమ జీవన విధానంలో, ప్రభుత్వ విధానంలో భాగంగా చేసుకోవాలని ఆయన ఆకాక్షించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యోగా కేవలం వ్యాయామం కాదని అదొక జీవన విధానమన్నారు. యోగా అంటే సరళంగా చెప్పాలంటే కలపడం ఇది ప్రపంచాన్ని కలిపింది అని ఆయన తెలిపారు.
 
విశాఖలోని ఆర్కే బీచ్‌లో మూడు లక్షల మందికిపై ప్రజలతో కలిసి ప్రధాని మోడీ కామన్ యోగా ప్రోటోకాల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందం, శాంతిని పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి ప్రపంచాన్ని నడిపించడం ద్వారా యోగా శాంతిని చేకూర్చగలదని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. 
 
"దురదృష్టవశాత్తు, నేడు ప్రపంచం మొత్తం ఉద్రిక్తత, అశాంతితో సతమతమవుతోంది. అనేక ప్రాంతాల్లో అస్థిరత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో యోగా మనకు శాంతి మార్గాన్ని చూపుతుంది. మానవాళి శ్వాస తీసుకోవడానికి సమతుల్యం చేసుకోవాడానికి తిరిగి సంపూర్ణంగా మారడానికి అవసరైన విరామ బటన్‌ యోగా" అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు