1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. BRS MLA Padi Kaushik Reddy Arrested Due to Threatened on Granite Trader

క్వారీ యజమానికి బెదిరింపులు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

padi koushik reddy
క్వారీ యజమానిని బెదిరించిన కేసులో భారత రాష్ట్ర సమితికి చెందిన హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను శనివారం వరంగల్‌‍లోని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సుబేదారీ పోలీస్ స్టేషన్‌ నుంచి ఎంజీఎం వరకు బందోబస్తు ఏర్పాటుచేశారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు. 
 
మరోవైపు, సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద భారాస శ్రేణులు ఆందోళన చేశారు. కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వినయ్ భాస్కర్, ఇతర నేతలు యత్నించారు. భారాస నేతలను పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వినయ్ భాస్కర్ వాగ్వాదానికిదిగాడు. 
తర్వాతి కథనం
ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా