1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Pakistan nominates Trump for 2026 Nobel Peace Prize over India-Pak conflict role

భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్

donald trump
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని అయినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదేమోనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్వేదం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, తాను ఇలా ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని ఆయన నైరాశ్యం వ్యక్తం చేశారు. నోబెల్ శాంతి బహుమతి 2023కి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన ట్రూత్ సోషల్ వేదికగా పెట్టిన ఓ పోస్టులో ట్రంప్ ఇలా పేర్కొన్నారు. 
 
కాంగో రువాండ్ మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్న ఆయన అందుకు చాలా సందోషంగా ఉన్నారన్నారు. ఇది హింసాత్మక రక్తపాతానికి, పౌరుల మరణాలకు దారితీసిన ఇతర యుద్ధాల కన్నా పెద్దదని, దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు. ఇరు వర్గాలు ఒప్పందపత్రాలపై సంతకం చేసేందుకు వాషింగ్టన్‌కు రానున్నట్టు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఇది ఆఫ్రికా, ప్రపంచం మొత్తానికి గొప్ప రోజుగా అభివర్ణించారు. అయితే, తాను ఇలాంటివి ఎన్ని చేసినా నోబెల్ బహుమతి లభించిందన్నారు. భారత్ - పాకిస్థాన్‌ల మధ్య లేదా సెర్బియా కొసావో మధ్య యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదని అసహనం వ్యక్తం చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
క్వారీ యజమానికి బెదిరింపులు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు