బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (14:44 IST)

ఆగష్టు 13నుంచి క్వారంటైన్‌లో ముంబై స్క్వాడ్.. ఒక్క రాత్రికి రూ.25వేలు చెల్లించి..?

Hotel
కోవిడ్-19 మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయినా ఎట్టకేలకు మళ్లీ స్టార్ట్ అయ్యేందుకు రెడీ అయిపోయింది ఐపీఎల్ 2021. సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఈ మెగా శిబిరం రీస్టార్ట్ అవనుంది. మరోసారి కరోనా ఆటంకం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్న ఐపీఎల్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికీ ఆరు రోజుల పాటు క్వారంటైన్ నిర్వహిస్తుంది.
 
ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. తమ ఆటగాళ్లు ట్రైన్ అవడానికి హోటల్ తో పాటు ప్రాక్టీస్ చేయడానికి, క్వారంటైన్ సమయం గడపటానికి తగు ఏర్పాట్లు చేసింది. సీజన్ సెకండాఫ్ పూర్తి చేయడానికి యూఏఈకి చేరిన రెండు జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. 
 
ఆగష్టు 13నుంచి క్వారంటైన్‌లో ఉంటున్న ముంబై స్క్వాడ్.. అబుదాబిలో ఉన్న సెయింట్ రెజిస్ సాదియత్ రిసార్ట్‌లో ఒక్క రాత్రికి రూ.25వేలు చెల్లించి స్టే చేస్తుందట. ట్రైనింగ్ సెషన్స్ పూర్తి అయిన తర్వాత ఫ్యామిలీలతో పాటు ఉండటానికి 5స్టార్ హోటల్ ఏర్పాటుచేసింది. ఇందులో వారికి ప్రైవేట్ బీచ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, అవుట్ డోర్ సదుపాయాలు కల్పిస్తుంది.
 
అద్భుతమైన ఇంటీరియర్ వర్క్ తో పెళ్లి వేడుకను తలపించే డెకరేషన్‌తో.. రెడీ చేయడంతో పాటు అవసరమైతే ఇండోర్ లోనే ట్రైనింగ్ సెషన్ పూర్తి చేసుకునేలా హోటల్ అరేంజ్మెంట్స్ చేసింది.