మంగళవారం, 2 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 సెప్టెంబరు 2025 (14:29 IST)

మెట్రో రైల్లో మహిళ వెనుక నిలబడి ప్యాంట్ జిప్ తీసిన కామాంధుడు

man sexually harassed a woman
ఇటీవలే గణేష్ నిమజ్జనోత్సవంలో దాదాపు వెయ్యి మందికి పైగా కామాంధులు మహిళలను అసభ్యంగా తాకుతూ షీ టీములకు దొరికిపోయారు. ఇక ఇప్పుడు మెట్రో రైళ్ల వంతు వచ్చింది. మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు కామాంధులు. ఇలాంటివారిని కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు వున్నా వారు మాత్రం భయపడటంలేదు.
 
ఆలస్యంగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రద్దీగా వున్న మెట్రో రైల్లో ఓ కామాంధుడు ఎక్కాడు. రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ వెనుక నిలబడ్డాడు. ఆ తర్వాత మెల్లగా తన ప్యాంటు జిప్ తీసి వెనుక నుంచి ఆమెను తాకాడు. కామాంధుడు చేసిన వికృత క్రీడను తోటి ప్రయాణికుడు వీడియో తీసాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.