దేశవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నందున, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తూర్పు మధ్యప్రదేశ్, సిక్కింలలో భారీ వర్షపాతం కోసం భారత వాతావరణ శాఖ (IMD) శనివారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాలు పసుపు హెచ్చరికలో ఉన్నాయి.
రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని అంచనా.
బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, కేరళ, అస్సాం సహా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ - మురాదాబాద్ తీర్థంకర మహావీర్ విశ్వవిద్యాలయంలో పిడుగుపాటుకు గురైన ఐదుగురు విద్యార్థులు ఆస్పత్రి పాలైనారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చోవడంతో ఐదుగురు విద్యార్థులపై పిడుగు పడింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఐదుగురు విద్యార్థులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యంగా విషమంగా వుందని.. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు.
కాలిన గాయాలతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న పక్‌బాడా పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు విద్యార్థులు టీఎంయూ క్యాంపస్‌లోని న్యూ హాస్టల్ వర్ధమాన్ భవన్‌లో నివసిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని దామో సాగర్‌కు చెందిన సంస్కర్ జైన్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సిద్ధాంత్ కుమార్ బీసీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మానవ్ సింగ్ మీరట్ నివాసి బీఎస్సీ నర్సింగ్, శివేష్ సింగ్ ప్రయాగ్‌రాజ్‌లో బీఏఎల్ఎల్‌బీ నాల్గవ సంవత్సరం విద్యార్థి, బంటీ రాజా లలిత్‌పూర్‌లో బీసీఏ మూడవ సంవత్సరం విద్యార్థి.
గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో, విద్యార్థులందరూ మహావీర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వర్షాలు కురవడంతో చెట్టు కింద నిలిచారు. భారీ వర్షాల కారణంగా పిడుగు పడింది. ఆ సమయంలో విద్యారులు చెట్టు కింద నిలబడి ఉన్న ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.