ఒక్క రీల్‌లో అలా పాపులరైన బర్రెలక్కకు పండంటి పాప పుట్టిందోచ్
Barrelakka
తాజాగా ఆసుపత్రి, డెలివరికి సంబంధించిన వీడియోలు తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూనే ఉంది. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క తన కష్టం మీద ఎదిగింది. ఉద్యోగం లేదని.. నాలుగు బర్రెలు కొనుక్కోవడం బెటర్ అనే రీల్ చేసి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యింది.
ఒక్క రీల్‌తో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసింది. కానీ గెలవలేదు. ప్రస్తుతం రాజకీయాలను పక్కనబెట్టి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
కుటుంబంతో హ్యాపీగా వుంది. పాప ముఖాన్ని చూపిస్తున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. బర్రెలక్కలా ఆమె బేబీ కూడా క్యూట్‌గా ఉందని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే బర్రెలక్క అసలు పేరు శిరీషా.
