సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (11:09 IST)

ప్రఖ్యాత చరిత్రకారుడు బాబాసాహెబ్​ పురందరే కన్నుమూత

Babasaheb Purandare
ప్రఖ్యాత చరిత్రకారుడు, పద్మ విభూషణ్​ బల్వంత్​ మోరేశ్వర్ పురందరే అలియాస్​ బాబాసాహెబ్​ పురందరే కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా.. మహారాష్ట్ర పుణెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 
 
కొన్ని రోజులుగా మహారాష్ట్ర పుణెలోని దీననాథ్​​ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. బాబాసాహెబ్ పురందరేగా ప్రాచుర్యం పొందిన బల్వంత్ మోరేశ్వర్​.. కొద్దిరోజుల క్రితం న్యూమోనియా బారిన పడగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.
 
అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించగా... అత్యవసర విభాగంలో వెంటిలేటర్​పై ఉంచి, వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. కానీ సోమవారం ఆయన చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు.  
 
శివాజీ చరిత్ర ప్రచారంలో.. మహారాష్ట్రతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్​ చరిత్రను ప్రచారం చేయడంలో పురందరే ప్రఖ్యాతిగాంచారు. 'రాజా శివఛత్రపతి' పేరుతో పురందరే.. 900 పేజీల పుస్తకాన్ని మరాఠీలో రచించారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ పుస్తకం 1950 చివర్లో తొలిసారి ముద్రణ కాగా.. అనేక సార్లు పునర్ముద్రణకు నోచుకుంది. 
 
1980 మధ్యలో 'జనతా రాజా' పేరుతో శివాజీ చరిత్రపై ఓ నాటకాన్ని ఆయన రచించి, దర్శకత్వం వహించారు. శివాజీపై పురందరే 12వేలకు పైగా ప్రసంగాలు ఇచ్చారు. 2015లో పురందరేను మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ర భూషణ్ పురస్కారంతో సత్కరించగా.. పురందరే మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.