కొల్హాపూర్‌లో భూప్రకంపనలు ... రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో భూప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. సోమవారం తెల్లవారుజామున 2.36 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
ఈ భూకంప కేంద్రం కొల్హాపూర్‌కు 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు భూమి కంపించిందని తెలిపింది.
కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అయితే అర్థరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్లను బయటకు పరుగులు తీశారు.
మరోవైపు, ఆదివారం వేకువజామున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో భూమి కంపించిన విషయం తెల్సిందే. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయి.