గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (16:24 IST)

వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

మహారాష్ట్రలోని థానె జిల్లాలో దారుణం జరగింది. 65 యేళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.  తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
థానే న‌గ‌రంలోని ఓ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీగార్డుగా ప‌నిచేస్తున్న 25 ఏళ్ళ యువ‌కుడు మంచినీళ్ల కోసం ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి తాగ‌డానికి మంచినీళ్లు ఇవ్వ‌మ‌ని అడిగాడు. 
 
దీంతో ఆమె నీళ్లు తీసుకుని వ‌చ్చేలోపు ఒంట‌రిగా ఉన్న‌ద‌ని గ‌మ‌నించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ నెల 3న ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా.. అదేరోజు వృద్ధురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు న‌మోదుచేసి నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టిన పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అత‌నిపై సంబంధిత సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేశారు.