శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (13:48 IST)

ఉద్యోగం పేరుతో నమ్మించి మైనర్ బాలికపై 400 మంది అత్యాచారం...

ఓ మైనర్ బాలిక కామాంధుల చేతిలో చిక్కింది. ఉద్యోగం పేరుతో నమ్మించిన కామాంధులు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడింది ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 400 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత సామూహిక అత్యాచారానికిగురైన గురై న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కితే.. కాపాడాల్సిన పోలీసే కామాంధుడై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు నెలలుగా ఆ అమ్మాయిపై సాగిన ఈ ఘోరకలి మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.
 
ఈ దారుణ ఘటన బీద్ జిల్లాలోని అంబజోగైలో చోటుచేసుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ యువతికి రెండేళ్ల క్రితం ఆమె తల్లి చనిపోయింది. ఆ తర్వాత తండ్రి వివాహం చేశాడు. ఏడాదిన్నర పాటు అత్తారింట్లోనే ఉన్న ఆమె.. మామ వేధింపులు భరించలేక పుట్టింటికి తిరిగొచ్చింది. 
 
ఈ క్రమంలోనే అంబజోగైలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ ఓ అకాడమీలో ఇద్దరు వ్యక్తులను కలిసింది. జాబ్ ఇప్పిస్తామని నమ్మించి.. ఆ ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు.
 
ఆ తర్వాత ఆరు నెలల పాటు 400 మందికిపైగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. వారిపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాలికకు.. అక్కడా అన్యాయమే జరిగింది. కేసు బుక్ చేయాల్సిన పోలీసే.. లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తాజాగా శిశు సంక్షేమ కమిటీ చొరవతో బీద్ జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.
 
ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భిణీ. ఈ దారుణంతో కుంగుబాటుకులోనైన ఆ అమ్మాయికి గర్భవిచ్ఛిత్తి చేసేందుకు శిశు సంక్షేమ కమిటీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ ఘటనకు సంబంధించి 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.