శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (09:44 IST)

బాలికల కళ్లకు గంతలు కట్టి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేసిన ఉపాధ్యాయుడు....

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఓ కీచక ఉపాధ్యాయుడు వెలుగులోకి వచ్చాడు. తన వద్ద చదువుకునే ఇద్దరు బాలికలకు కళ్లకు గంతలు కట్టి ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడింది కూడా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావడం గమనార్హం. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. 
 
ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న అనిల్‌ నాలుగు రోజుల కిందట ఇద్దరు బాలికల కళ్లకు గంతలు కట్టి ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. దీంతో సదరు బాలికలు బడికి వెళ్లడం మానేశారు. విద్యార్థినులను తల్లిదండ్రులు ఆరా తీయగా జరిగిన విషయం చెప్పారు. 
 
దీంతో ఆగ్రహించిన వారు గ్రామస్థులతో కలిసి గురువారం అనిల్‌ని నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో గ్రామస్థులు ఆయనపై దాడి చేసి చితకబాదారు. ఈ ఘటనపై విద్యార్థినుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గతంలోనూ అనిల్‌ ఇలాంటి పనులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.