శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:54 IST)

సూర్యాపేట చెరువులో రెండు మృతదేహాలు

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట చెరువులో రెండు మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 
 
జిల్లాలోని సద్దుల చెరువులో ఈ రెండు మృతదేహాలు కనిపించాయి. చెరువులో వేరువేరు ప్రాంతాల్లో ఒక మహిళ, ఒక వ్యక్తి మృతదేహాలను గుర్తించారు. వాటిని బయటకు తీసుకొచ్చి ఆనవాలు పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
ఈ ఇద్దరు కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడివిడిగా ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.