శ్మశానంలో స్థలం కొరత.. ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలు దహనం

deadbodies
ఠాగూర్| Last Updated: గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:28 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రెండో దశ వ్యాప్తి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వుంది.

దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో 50 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ పునరావృతమవుతున్నాయి.

కరోనావైరస్‌ బారినపడి మరణించిన వారి అంత్యక్రియలకు స్మశానంలో స్థలం లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో మంగళవారం జరిగింది.

బీడ్ జిల్లాలో కరోనా మరణించిన వారిని ముందుగా అంబాజ్‌గాయ్‌ పట్టణంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే అవి కరోనా బారిన పడి మరణించిన వారి శవాలు కావటంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు.

దీంతో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని మరో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ స్థలం సరిపడ లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు.దీనిపై మరింత చదవండి :