శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:17 IST)

కోదాడ పెద్ద చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ విషాదకర ఘటన జరిగింది. ప్రేమ జంట ఒకటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కోదాడ, లక్ష్మీపురానికి చెందిన మణికంఠ (19) అనే యువకుడు తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఫాతిమ (17) కోదాడ పట్టణంలో అరబిక్‌ ఖురాన్‌ నేర్చుకుంటున్నది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వాళ్లిద్దరు గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
శుక్రవారం కోదాడ పెద్దచెరువులో మృతదేహాలను గుర్తించిన జాలర్లు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. మృతులను మణికంఠ, ఫాతిమగా గుర్తించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.