1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (17:24 IST)

తాడేపల్లిలోని ఓ ఇంట్లో దంపతుల మృతదేహాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ఇంట్లో దంపతుల మృతదేహాలు కలకలం రేపాయి. బకింగ్ హామ్ కెనాల్ పక్కన ఉండే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదును అందించారు. 
 
అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి. ఇంటి మొత్తాన్ని పరిశీలించినా వారి మరణాలకు గల ఆధారాలు పోలీసులకు లభించలేదు. 
 
అంతేకాదు వారి పేర్లు, ఊరు, ఇతర వివరాలు కూడా ఆ ఇంట్లో లేకపోవడంతో... అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మృత దేహాలు పడి ఉన్న ప్రాంతంలో మందులు, ఆథ్యాత్మిక సీడీలు, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు దొరికినట్టు పోలీసులు తెలిపారు.