ఇంటి పన్నుపై నిరసన, సీపీఎం,సిపిఐ నేతల అరెస్ట్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను కు వ్యతిరేకం గా
విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. సీపీఎం,సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
వారందరినీ పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. కమ్మూనిస్టు నాయకుల్ని ఎత్తి మరీ వ్యానుల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. మోడీ- జగన్ ప్రభుత్వాలు తెచ్చిన పన్నుల భారాలకు విజయవాడ కౌన్సిల్, పాలక పక్షం బాధ్యత వహించాలని సీపీఎం నాయకుడు సి.హెచ్. బాబూరావు అన్నారు.
ఆస్తి పన్నుపై రబ్బర్ స్టాంప్ వేసి ఆమోదిస్తే, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో ఆందోళన ఉదృతమవుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. ధర్నా చేసిన సీపీఎం నేతలు సిహెచ్ బాబూరావు, డివి కృష్ణా, డి. కాశీ నాథ్, సిపిఐ నేతలు శంకర్, కోటేశ్వరరావుతోపాటు 70 మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు.