సంబంధిత వార్తలు
- ఏడు నెలల పసికందుపై పైశాచికత్వం... ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు
- ఢిల్లీలో భారీ ఉగ్రవాద దాడికి ఉగ్రవాదుల ప్లాన్, పోలీసులకు హెచ్చరికలు
- కన్నకూతురిపై కన్నేసి.. అన్నంలో నిద్రమాత్రలు కలిసి రేప్ చేసిన తండ్రి
- 'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ గుండెపోటుతో కన్నుమూత
- విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో కరోనరీ కాల్షియం స్కోర్ ద్వారా ముందుగానే గుండెపోటు గుర్తించవచ్చు
టైమ్‌కు రావాలన్న హెచ్ఎం.. భర్తతో చితకబాదించిన లేడీ టీచర్
తెలంగాణాలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. స్కూల్‌కు కరెస్ట్ టైమ్ రావాలంటూ ఆ పాఠశాలలో పని చేసే లేడీ టీచర్‌ను ప్రధానోపాధ్యాయురాలు ఆదేశించింది. దీంతో ఆగ్రహించిన ఆ లేడీ టీచర్ తన భర్తతో హెచ్ఎంను చితకబాదించింది. నల్గొండ జిల్లా దాచేపల్లిలో ఈ ఘటన జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దాచేపల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రజనీ అనే ఉపాధ్యాయురాలు సమయపాలన పాటించడం లేదు. పాఠశాలకు కరెక్ట్ సమయానికి రావడం లేదని వాడపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పులగం రాధిక గుర్తించి, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న రజని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై ఫిర్యాదు చేసిన రాధికపై కసి తీర్చుకోవాలనుకున్నారు. మల్కాపట్నం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న తన భర్త శ్రీనివాస రెడ్డికి విషయం చెప్పి రాధికపై దాడి చేయాలని ఉసిగొల్పింది.
దీంతో పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాల ఉపాధ్యాయుడు దీపాల కృష్ణ ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు రాధిక దంపతులు ఈ నెల 19న వాహనంపై వస్తుండగా మిర్యాలగూడకు చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో రామాపురం అడ్డరోడ్డు వద్ద వారిపై దాడి చేశారు.
ఆ తర్వాత వారి వద్దనున్న ఐదు సవర్ల బంగారం తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీనివాసరెడ్డి, రజనిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు నిన్న నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి ఉత్తర్వులు జారీ చేశారు.
