విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో కరోనరీ కాల్షియం స్కోర్ ద్వారా ముందుగానే గుండెపోటు గుర్తించవచ్చు
నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ చేరువ కావడంతో పాటుగా అందుబాటు ధరలలో లభించాలన్న లక్ష్యంతో మణిపాల్ హాస్పిటల్, విజయవాడ పలు ఆర్యోగ సంరక్షణ ప్యాకేజ్‌లను విడుదల చేసింది. వీటి గురించి మణిపాల్ హాస్పిటల్- చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ నల్లమోతు తన 35 సంవత్సరాలకు పైగా ఉన్న అనుభవంతో మాట్లాడుతూ, ప్రస్తుత మహమ్మారి సమయంలో మనలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యతాంశం అయింది.
ఇటీవల అధ్యయనాల ప్రకారం కోవిడ్ 19 కారణంగా గుండె కండరాలకు నష్టం కలుగడంతో పాటుగా గుండె సంబంధిత వ్యాధులూ వస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపరిచే అంశాలలో ఒకటిగా కండరాల వాపు నిలుస్తుంది. అందువల్ల, మనం వీలైనంతవరకూ మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరీ ముఖ్యంగా మన గుండెను పదిలంగా కాపాడుకోవాల్సి ఉంది.
ఈ హార్ట్ కేర్ ప్యాకేజెస్ ద్వారా తొలి దశలోనే గుండె సంబంధిత సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా తగిన చికిత్సనందించడమూ వీలవుతుంది. ఉదాహరణకు, ఎకో కార్డియోగ్రామ్ ద్వారా ఎజెక్షన్ ప్రాక్షన్ (ఔగఉఊ) కనుగొనడం ద్వారా కండరాలకు అయిన నష్టాన్నీ అంచనా వేయగలం. కరోనరీ కాల్షియం స్కోర్, కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ) మెషీన్‌ను వినియోగించుకుని ధమనులలో కాల్షియంను కనుగొనడం ద్వారా గుండెపోటు అవకాశాలనూ పరీక్షిస్తుంది అనిఅన్నారు
ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ సామాన్యులపై ప్రభావం చూపే అతి ప్రధానమైన జీవనశైలి వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి మణిపాల్ హాస్పిటల్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. మా హాస్పిటల్ మూడు ప్యాకేజెస్- కార్డియాలజీ ప్యాకేజ్ (699 రూపాయలు), కరోనరీ ఆర్టెరీ కాల్షియం స్కోర్ ప్యాకేజ్ (2499రూపాయలు)మరియు పోస్ట్ కోవిడ్ హెల్త్ చెకప్ ప్యాకేజ్ (5500రూపాయలు)- విడుదల చేసింది.
మన ఆరోగ్యంపై కోవిడ్-19 చూపిన దుష్పరిణామాల నేపథ్యంలో ఈ ప్యాకేజెస్ సహాయంతో ఓ వ్యక్తి యొక్క గుండె ఆరోగ్యం ఏ విధంగా ఉందో తెలుసుకోవడం సాధ్యపడటంతో పాటుగా గుండె సమస్యలను ముందుగానే గుర్తించడమూ వీలవుతుంది. దీనితో పాటు కోవిడ్ వచ్చిన వారికి పోస్ట్ కోవిడ్ హెల్త్ చెక్ ప్యాకేజ్ సేవలు అందుబాటులో ఉంటాయి. తద్వారా సమస్యకు మెరుగ్గా చికిత్సనందించడమూ వీలవుతుంది. మా రోగి కేంద్రీకృత సదుపాయాలు, నిష్ణాతులైన స్పెషలిస్ట్‌లు ద్వారా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము అని అన్నారు.