బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (15:37 IST)

విజయవాడలో పవన్ కళ్యాణ్: జాబ్ లెస్ క్యాలెండర్‌పై చర్చ

విజయవాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో కోవిడ్‌ మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. కరోనా సమయంలో ప్రజలకు జనసైనికులు అండగా నిలబడ్డారని, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పార్టీ, కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ఇన్సూరెన్స్‌ పథకానికి కోటి విరాళంగా ఇచ్చానన్న జనసేనాని.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడపడమంటే.. ఆషామాషీ కాదని చెప్పారు. 
 
రెండు రోజుల పాటు అక్కడే ఉండి.. పార్టీ నేతలతో కీల సమావేశం నిర్వహిస్తారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై పార్టీ నేతలతో ఆయన చర్చిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.