నల్లటి దుస్తుల్లో జనసేనాని, కోవిడ్ బాధితులకు కోటి రూపాయల విరాళం
చానాళ్ళకు మంగళగిరి జనసేన కార్యాలయానికి చేరిన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కోవిడ్ మృతులకు సంతాపం తెలుపుతూ, తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నల్ల డ్రెస్‌తో ఆయన తన సంతాపాన్ని ప్రకటించారు.
కరోనా మొదటి, రెండో వేవ్‌ల సమయంలో ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి కరోనా సమయంలో జన సైనికులు అండగా ఉన్నారని తన పార్టీ కార్యకర్తలను కొనియాడారు. ఈ సందర్భంగా కోవిడ్ బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్.
ప్రజల ఆదరణ అభిమానం తోనే నేను ఇలా ఉన్నాను... ప్రజల ఆదరణ ఉంటేనే రాజకీయ నాయకులు రాజకీయాల్లో మరింతగా రాణిస్తారు...అని పవన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్... రోడ్డు మార్గంలో మంగళగిరి జనసేన పార్టీకి చేరుకొన్నారు. తొలుత తన పార్టీ రాజకీయ నేతల సమావేశంలో పాల్గొంటున్నారు. కోవిడ్ వైరస్ సోకి మరణించిన వారికి నివాళులర్పిస్తూ, భావోద్వేగంగా ప్రసంగించారు.