శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జులై 2021 (23:39 IST)

పవన్ కల్యాణ్ గురించి తాజా అప్డేట్.. ఏంటదో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఓ తాజా అప్డేట్.. నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఓ లగ్జీరియస్ ఎస్‌యూవీ వెహికల్ కొన్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎస్‌యూవీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ న్యూ కార్ ఆర్డర్ చేశారట పవర్‌స్టార్. 
 
ఆ కొత్త కారు ధర అక్షరాలా 4 కోట్లు. అద్భుతమైన ఫీచర్స్‌తో, స్టైలిష్ అండ్ రాయల్‌గా ఉండే ఈ కార్‌లో పీకే ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 
 
ప్రస్తుతం 'వకీల్ సాబ్' 27వ సినిమా 'హరి హర వీరమల్లు' పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. తర్వాత రానాతో కలిసి మలయాళీ సూపర్‌హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లోనూ నటిస్తున్నారు. తర్వాత 'గబ్బర్ సింగ్' హరీష్ శంకర్‌తో సినిమా చెయ్యబోతున్నారు పవన్.