వకీల్ సాబ్ రీ ఎడిటింగ్ వెర్షన్.. 300 థియేటర్లలో మళ్లీ పవర్ సినిమా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా.. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల వేట కొనసాగించింది. బాలీవుడ్‌లో బిగ్ బీ అమితాబ్ నటించిన పింక్ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాకి ఐఎండీబీ ఏడవ స్థానంలో ర్యాంకింగ్ ఇచ్చింది. హిందీ తెలుగు అండ్ తమిళ బాషల్లో రీమేక్ అయిన పింక్ రేటింగ్స్‌లో వకీల్ సాబ్ సినిమాకే టాప్ రేటింగ్ వచ్చింది. మెసేజ్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్‌గా బాలన్స్ అయిన ఈ సినిమా ఫస్ట్ మూడు రోజులు బాక్సాఫీస్‌ని దున్నేసాయి.
పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకున్న వకీల్ సాబ్ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి బ్రేకులు పడ్డాయి. దీంతో ఓటీటీలో కూడా ముందే విడుదల చేయడంతో అక్కడా పవన్ మేనియా కొనసాగింది. అయితే, ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ రిలాక్సేషన్ ఇవ్వడంతో పాటు థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి ప్లాన్ చెయ్యడంతో వకీల్ సాబ్‌ని మళ్లీ థియేటర్లలో రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీలో వైజాగ్ జగదాంబ థియేటర్లో రవితేజ క్రాక్ సినిమాను మళ్ళీ విడుదల చేయగా ఇప్పుడు వకీల్ సాబ్ ను ఏకంగా 300 థియేటర్లలో విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
అంతేకాదు.. పవన్ అభిమానులను మరింత సర్ ప్రైజ్ ఇచ్చేలా ఈసారి రీ ఎడిటింగ్ వెర్షన్ తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతుంది. వకీల్ సాబ్ ఎడిటింగ్ రూమ్‌లో పక్కన పెట్టిసిన కొన్ని సీన్లు కూడా కలిపి ఈసారి కొత్త వెర్షన్ విడుదల చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే దిల్ రాజు ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ చేసినా ముందుగా పెద్ద సినిమాలేవీ వచ్చే పరిస్థితి ఉండదు కనుక ఆ గ్యాప్ ను వకీల్ సాబ్ రీ ఎడిట్ వెర్షన్ తో భర్తీ చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తుంది.