శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (18:32 IST)

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు జోస్యం చెప్పిన శ్రీ‌రెడ్డిపై అభిమానులు ఫైర్‌

Srireddy-nithya
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మ‌రోసారి శ్రీ‌రెడ్డి కామెంట్లు చేసింది. ఆయ‌న‌కు బిజెపి నుంచి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను గౌర‌వించేవిధంగా వుంటుంద‌ని ర‌క‌ర‌కాలుగా అభిమానులు స్పందిస్తున్నారు. ఇదే స‌మ‌యంగా శ్రీ‌రెడ్డి త‌న ప్ర‌చారాన్ని వాడుకుంది. ఇంత‌కుముందు ప‌లువురు ప్ర‌ముఖులు టార్గెట్ చేసి చెన్నైయ్ చెక్కేసిన ఆమె అక్క‌డ ఉద‌య‌నిధి స్టాలిన్ గురించి కూడా కామెంట్ చేసింది. 
 
తాజాగా నేడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌నుద్దేశించి ట్వీట్ చేసింది. అరేయ్ ఎందుకురా, ట్విట్టర్ లో ట్రెండ్ లు చేస్తారు ఆ పావలా గాడి గురించి, పావలా గురించి పావలా ఫ్యాన్స్ గొప్పలు చెప్పుకుంటమే, నిజానికి అక్కడ ఏం లేదు, అంతా డొల్ల, 2024 లో తొక్కి పడేస్తారు, జాగ్రత్త. అంటూ కామెంట్ పెట్టింది. అభిమానులు ర‌క‌ర‌కాలుగా స్పందించారు. ఒక‌రిద్ద‌రు గౌర‌వంగా, చూడండి శ్రీ రెడ్డి గారు మీకు ఉన్నారు ఏమో పావలా ఫ్యాన్స్. మా అన్నయ్య గురించి మాట్లాడే ముందు కొంచం మర్యాదగా మాట్లాడండి. మీకేమైనా ఫ్యూచర్ ముందే తెలుస్తుందా  2024 లో మా అన్నయ్య సీఎం ఆవుతాడో లేదో మీరే చేపుస్తునారు 2024 చూద్దాం అండి ఎవర్ని ఎవరు తొక్కి పడేస్తారో, అంటూ స్పందించారు. 
 
కానీ మ‌రికొంద‌రు ఆమె ప‌క్కామాస్ కాబ‌ట్టి ఆ త‌ర‌హాలో ఆ భాష‌లోనే స్పందించారు.  నీకు అది ఎక్కువై మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తావ్ మాకు ఎక్కువై ట్విట్టర్లో ట్రేండింగ్ లు చేస్తాం అంటూ కామెంట్ చేశారు. ఒక‌రైతే ఏకంగా నిత్యానంద స్వామి ఫొటోను పెట్టి ఆ ప‌క్క‌నే వేశ్యానంద శ్రీ‌రెడ్డి ఫొటోపెట్టి. భ‌విష్య‌త్ చెప్పే స్వామి అంటూ సెటైర్ వేశారు. ఇది అభిమానుల్లో వైర‌ల్ అవుతోంది.