ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (12:11 IST)

పవన్ సరసన నటి మానస రాధాకృష్ణన్!

Manasa
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరశంకర్ అనే సినిమా చేస్తుండగా, దీంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మరి కొద్దిరోజులలో పవన్ తన 28వ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నాడు. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
 
కొద్ది రోజులుగా పవన్‌- హరీష్ శంకర్ సినిమాకి సంబంధించి జోరుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. చిత్రంలో పవన్ డ్యూయల్ పాత్ర పోషించనున్నాడని, ఈ చిత్రానికి సంచారి లేదా స్టేట్‌కి ఒక్కడే అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వీటిని హరీష్ శంకర్ కొట్టి పారేశారు. 
 
అలానే ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మలయాళ నటి మానస రాధాకృష్ణన్ నటిస్తుంది అన్న వార్త వైరల్ కాగా, దీనిపై మానస స్పందిస్తూ.. పవన్ చేస్తున్న 28వ సినిమాలో లేనని తెలియజేస్తున్నాను, కానీ నాకు పవన్ సర్ అంటే ఇష్టం అని" క్లారిటీ ఇచ్చింది.