1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Vijayendra Prasad’s powerful script for Pawan Kalyan

బాహుబలి స్టోరీ మేకర్‌తో పీకే.. అద్భుతమైన స్టోరీ సిద్ధం!

Vijayendra Prasad
బాహుబలి స్టోరీ మేకర్‌తో పీకే చేతులు కలపనున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రైటర్‌గా మారిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేస్తున్నారు.

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని విజయేంద్ర ప్రసాద్‌ కల్పిత కథని రూపొందించగా, దీనిని బేస్ చేసుకొని జక్కన్న సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 13న సినిమా విడుదల కానుంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తైందని ఆయన అన్నారు.
 
ఇక పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన స్టోరీ సిద్ధం చేశారని, ఆ స్టోరీని పవన్‌కు వినిపించగా ఫుల్ ఇంప్రెస్ అయ్యాడంటూ జోరుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై రచయిత విజయేంద్రప్రసాద్ స్పందించారు. 
 
పవర్ స్టార్‌కి కథ రాసేందుకు తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని, కానీ కథ కావాలని ఎవరూ తనని సంప్రదించలేదని ఆయన తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్‌తో రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం పుకార్లేనని తేలింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అంతరిక్షంలోకి తొలి తెలుగు మహిళ.. శిరీష.. బండ్ల గణేష్ బంధువా?