శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 22 జులై 2021 (13:01 IST)

అదే మా అజెండాః కె. నిరంజన్ రెడ్డి

K. Niranjan Reddy
`కొత్త కంటెంట్ ఉండాలి అనేది మా అజెండా. టాలెంట్ ఎవ‌రైనా మా వెబ్‌సైట్లో ఉన్నఈమెయిల్ అడ్ర‌స్ కు వాళ్ల స్క్రిప్ట్ సినాప్సిస్ మాకు పంపొచ్చు. గ్యారెంటీగా మేము రెస్పాండ్‌ అవుతాము. గ‌తేడాది కాలంలో దాదాపు 200మంది కొత్త టెక్నీషియ‌న్స్ మ‌మ్మ‌ల్ని రీచ్ అయ్యారు` అని `హౌస్ అరెస్ట్` నిర్మాత‌ కె. నిరంజన్ రెడ్డి తెలియ‌స్తున్నారు. 
 
రెగ్యుల‌ర్ సినిమాలే  కాకుండా యంగ్ టాలెంట్‌ని ప్రోత్స‌హించి డిఫ‌రెంట్ కంటెంట్‌ని ఆడియ‌న్స్ అందించాల‌న్నదే మా ల‌క్ష్యం అని అంటున్నారు ప్రైమ్‌షో ఎంట‌ర్టైన్‌మెంట్ నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ప్ర‌స్తుతం ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో రూపొందిన రెండు చిత్రాలు విడుద‌ల‌కి సిద్దంగా ఉన్నాయి. అలాగే ఈ బేన‌ర్లో మ‌రో మూడు చిత్రాల నిర్మాణం జ‌రుగుతోంది. జులై 22 ప్రైమ్‌షో ఎంట‌ర్టైన్‌మెంట్ నిర్మాత కె. నిరంజన్ రెడ్డి పుట్టిన‌రోజు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన విశేషాలు. మాది నల్గొండ జిల్లా, నేను హైద‌రాబాద్‌లోనే పుట్టిపెరిగాను. ఇంజ‌నీరింగ్ పూర్త‌య్యాక మాస్ట‌ర్స్‌ చేయ‌డానికి యూఎస్ వెళ్లాను. అది కంప్లీట్ అయ్యాక రెండేళ్లు జాబ్ చేసి ఆ త‌ర్వాత ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ త‌ర్వాత రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్క‌డా రాణించాం. అయితే సాధార‌ణంగానే సినిమా అనేది మ‌న లైఫ్‌లో ఒక భాగం. అలానే నాకు సినిమాల‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అందులో భాగంగానే ప్రైమ్ షో ఎంట‌ర్టైన్‌మెంట్‌ ని స్థాపించి నిర్మాణ‌రంగంలోకి ఎంట‌ర్ అయ్యాం. భ‌విష్య‌త్తులో ఎగ్జిబిష‌న్ రంగంలోకి వెళ్తాము. అలాగే సొంతంగా ఒక ఓటీటీ పెట్టే ఆలోచ‌న కూడా ఉంది. 
 
డెడికేటెడ్ టీమ్
నాకు మంచి టీమ్ కుదిరింది. మా ప్ర‌జెంట‌ర్ చైత‌న్య, అలాగే అశ్రిన్ రెడ్డిగారు వ‌న్ ఆఫ్ మై పార్ట్‌న‌ర్ వారిద్ద‌రికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఇక్క‌డ‌ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు వాళ్లే చూసుకుంటారు. 
టైమ్‌కి పూర్తి వ్యాల్యూ ఇస్తాం కాబ‌ట్టే ఒక ఎడాదిలోనే మూడు సినిమాలు చేయ‌గ‌లిగాం. మ‌రో మూడు ప్రాజెక్ట్స్ చేయ‌బోతున్నాం. ఇదంతా ఒక డెడికేటెడ్ టీమ్ ఉంది కాబ‌ట్టే సాధ్యం అయ్యింది. 
 
 ప్ర‌తి సబ్జెక్ట్ కొత్త‌గా.
ప్ర‌స్తుతం మా బేన‌ర్‌లో రూపొందిన హౌస్ అరెస్ట్ చిత్రాన్ని థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌గానే వెంట‌నే రిలీజ్ చేస్తాం. చిన్న‌పిల్ల‌ల మీద సినిమా వ‌చ్చి చాలా రోజులైంది. త‌ప్ప‌కుండా ఫ్యామిలీస్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే  రెండు వారాలలో  `బాయ్‌ఫ్రెండ్‌ఫ‌ర్‌హైర్` చిత్రాన్ని విడుద‌ల చేస్తాం.  అది ప్యూర్ రామ్ కామ్ స‌బ్జెక్ట్‌. వీటితో పాటు  ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ‌, తేజ స‌జ్జ కాంభినేష‌న్లో హ‌ను-మాన్ ఒక సూప‌ర్‌హీరో మూవీ. మా బేన‌ర్‌లో వ‌చ్చే ప్ర‌తి సబ్జెక్ట్ ఖ‌చ్చితంగా కొత్త‌గా ఉండాల‌నే ఉద్దేశ్యంతోనే డిఫ‌రెంట్ జోన‌ర్స్‌లో సినిమాలు తీస్తున్నాం. స్పైడ‌ర్‌మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్ త‌ర‌హాలో హ‌ను-మాన్ కూడా క్లీన్ యు ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు.
 
యు.ఎస్.లోనే అలా జ‌ర‌గ‌లేదు
ఈ క‌రోనా స‌మ‌యంలో థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డం చాలా బాధాకర‌మైన విష‌యం. దానివ‌ల్ల థియేట‌ర్ సిస్ట‌మ్ అనేది క‌నుమ‌రుగైపోతుంది అనేది కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మే. ఎందుకంటే యూఎస్ లాంటి వెల్‌డెవ‌ల‌పుడ్ కంట్రీలో కూడా ప్రేక్ష‌కులు సినిమాని థియేట‌ర్ల‌లో చూడ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. కాబ‌ట్టి త‌ప్ప‌కుండా థియేట‌ర్స్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ య‌ధావిధిగా న‌డుస్తాయి. ప్రేక్ష‌కులు ఎప్పుడు సినిమాని థియేట‌ర్ల‌లో చూడ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. అందుకే బాయ్‌ఫ్రెండ్‌ఫ‌ర్‌హైర్, హౌస్ అరెస్ట్ చిత్రాల‌కి మంచి ఓటిటి ఆఫ‌ర్ వ‌చ్చినా థియేట‌ర్లో విడుద‌ల‌చేయడానికి సిద్ద‌మ‌య్యాం.