సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 22 జులై 2021 (11:56 IST)

ఆదిత్య 369లో చెప్పింది నేడు జ‌రుగుతుంది - ఇంతకంటే ఏం కావాలిః సింగీతం శ్రీనివాసరావు

singeetam Srinivasa Rao
నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ రెండో చిత్రమిది. జూలై 18) 'ఆదిత్య 369' విడుదలై 30 సంవత్సరాలు. బాల‌కృష్ణ క‌రెక్టైన న‌టుడు. ఇప్ప‌టి రోబో, బాహుబ‌లి వంటి సినిమాలు వ‌స్తున్న నేటి ట్రెండ్‌లోనూ ఆదిత్య సినిమా ఇంకా సోస‌ల్‌మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాసరావు క‌లిస్తే ఆనాటి విశేషాలు తెలియ‌జేస్తున్నారు. అవి మీకోసం.
 
ప్రతి సినిమా పునఃపుట్టినరోజు చేసుకుంటుంది. అయితే, 'ఆదిత్య 369' ప్రత్యేకత ఏంటంటే. రిలవెన్స్. కాంటెంపరరీ రిలవెన్స్. అదెలా అంటే? ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగింది. మేం ఇండియాలో ఉన్నాం. పెళ్లిని లైవ్ లో చూశాం. వెంటనే నాకు అందరూ ఫోనులు. పెళ్లి, శుభాకాంక్షలు పక్కనపెడితే 'సార్, మీరు ఆ రోజు ఆదిత్య 369లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజు జరిగింది' అని. సినిమాలో పోలీస్ స్టేషన్ ను ఫైవ్ స్టార్ హోటల్ లా చేశాం. అదింకా రాలేదు. ఎయిర్ ట్రాఫిక్ గురించి చెప్పాం. అదింకా రాలేదు. భవిష్యత్తులో అవన్నీ వస్తాయి. 
 
Adithya 369 team
ముఖ్యంగా చెప్పవలసిన ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిన అబ్బాయి పాణిని అని ఉన్నాడు. నాసాలో పని చేస్తున్నాడు. అతను ఆస్ట్రో ఫిజిసిస్ట్. గొప్ప శాస్త్రవేత్త. ఇద్దరు కొలీగ్స్ తో కలిసి ఇంతవరకు ప్రపంచంలో వచ్చిన టైమ్  మెషీన్ కథలన్నీ తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేశారు. స్పీల్ బర్గ్ 'బ్యాక్ టు ఫ్యూచర్'తో సహా అన్ని కథలు తీసుకున్నారు. లైట్, క్వాంటమ్ థియరీ వాటి ప్రకారం చూసి, 'ఆదిత్య 369' టైమ్ మెషీన్ అనేటటువంటిది బెస్ట్ అని నిర్ణయించారు. ఎందుకు? అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే, "స్పీల్ బర్గ్ సినిమాలో కార్లు అలా స్పేస్ లో వెళ్లిపోయి మాయమవుతాయి. టైమ్ మెషీన్ టైమ్ లో ట్రావెల్ చేస్తుంది గానీ స్పేస్ లో కాదు. 'ఆదిత్య 369'ల టైమ్ మెషీన్ వర్టికల్ యాక్సెస్ లో అలా తిరిగి తిరిగి మాయమవుతుంది' అని. 
 
ఈ విధంగా ఇవాళ్టికీ ఎంతో రిలవెన్స్ ఉన్న సినిమా ఇది. నేనూ ఎన్నో సినిమాలు చేశాను. అవన్నీ ప్రతి ఏడాది పుట్టినరోజులు చేసుకుంటాయి. అయితే, అవి ఆ రోజుల్లో చాలా బావుంటాయని అనుకుంటాం. ఈ రోజులకు అన్వయించుకునే సినిమాలు కాదు. ఈ ఒక్క 'ఆదిత్య 369'ను మాత్రం అన్వయించుకోవచ్చు. అటువంటి ప్రత్యేకతను సినిమా సంతరించుకుంది. అందుకని, 'ఆదిత్య 369' 30 ఏళ్లు పూర్తి చేసుకుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సినిమాకు పని చేసిన వాళ్లందరికీ, సినిమాను చూసి ఇష్టపడి మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్లందరికీ ధన్యవాదాలు" అని చెప్పారు.