శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 14 జులై 2021 (12:58 IST)

లెజెండ్‌కు మించిన ‘అఖండ’మైన యాక్ష‌న్‌లో బాల‌కృష్ణ‌

Akhanda location
నటసింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను అఖండగా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తెలుగు చిత్రసీమలోనే మొదటిసారిగా ఓ టీజర్ ఈ స్థాయిలో వ్యూస్ సాధించింది. 50 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి ఇంకా సోషల్ మీడియలో దూసుకెళ్తోంది.
 
రెండురోజుల‌నాడే హైద్రాబాద్‌లో అఖండ చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇక ఈ షెడ్యూల్‌తో అఖండ షూటింగ్ పూర్తి కానుంది. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ నుంచి అఖండ గెటప్ లో ఉన్న బాలకృష్ణకు దర్శకుడు బోయపాటి శ్రీను సీన్ వివరిస్తున్న ఓ స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ షెడ్యూల్‌లో అఖండ‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ చేయ‌నున్నారు. చుట్టూ క్వారీ కొండ ప్రాంతమైన ఈ లొకేష‌న్‌లో `లెజెండ్‌` త‌ర‌హాలో ఊహించ‌ని మ‌లుపుల‌తో యాక్ష‌న్ వుంటుంద‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. అందులో ఎలాగైతే బాల‌కృష్ణ‌కు క‌నిపిస్తే విజిల్స్ ప‌డ్డాయో అంత‌కంటే ఎక్కువ‌గా ఈ యాక్ష‌న్‌కు పేరు వ‌స్తుంద‌ని తెలుస్తోంది.
 
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంంది. శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.  రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా  వ్యవహరిస్తున్నారు.