బుధవారం, 29 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:27 IST)

లైంగిక వేధింపుల నివారణకు బీసీఐ కొత్త విధానం

క్రికెటర్లపై లైంగిక వేధింపుల నివారణ కోసం బీసీసీఐ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. తాజాగా బీసీసీఐ ఆమోదించిన ఆ విధానం పరిధిలోకి భారత క్రికెటర్లూ వస్తారు. ఇప్పటివరకూ లైంగిక వేధింపుల విషయంలో బీసీసీఐకి ఓ విధానమంటూ లేదు.
 
తాజాగా అధికార ప్రతినిధులు, అపెక్స్‌ కౌన్సిల్, ఐపీఎల్‌ పాలక వర్గ కమిటీ సభ్యులు, సీనియర్‌ స్థాయి నుంచి అండర్‌-16 వరకూ క్రికెటర్లు.. ఇలా దాదాపు అందరికీ వర్తించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 
 
లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు నలుగురు సభ్యులతో కూడిన అంతర్గత కమిటీ (ఐసీ)ని ఏర్పాటు చేయనుంది. ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి విచారణ జరిపి ఈ కమిటీ 90 రోజుల్లో తమ నివేదికను బీసీసీఐకి అందించాల్సి ఉంటుంది. 
 
దానిపై 60 రోజుల్లోపు బీసీసీఐ నిర్ణయం ప్రకటిస్తుంది. ఫిర్యాదుదారు లేదా ప్రతివాది ఒకవేళ బీసీసీఐ తీర్పుపై అసంతృప్తితో ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చు.