గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. కాలుజారి చెరువులో పడి..?
గన్నవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గన్నవరం సమీపంలో కారును కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు తిరుపతికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు ప్రయాణీకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అలాగే కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వారిని నవీన్‌కుమార్ (11), సాయి (16), వెంకటజోసఫ్ (16)లుగా గుర్తించారు. హోలీ ఆడి, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నవీన్‌కుమార్, వెంకటజోసఫ్ మృతదేహాలు లభ్యం కాగా, సాయి మృతదేహం కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.