గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (12:54 IST)

గని టీజర్ రిలీజ్.. రామ్ చరణ్ వాయిస్ అదుర్స్ (టీజర్)

వరుణ్‌ తేజ్ హీరోగా ‘గని’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వరుణ్ వాయిస్ ఓవర్‌లో వచ్చిన కొన్ని మాటలు బాగున్నాయి. నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. 
 
ప్రతి ఒక్కరి కథలో కష్ఠాలు ఉంటాయి.. కన్నీళ్లు ఉంటాయి.. కోరికలు ఉంటాయి.. కోపాలు ఉంటాయి.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది. అయితే ఛాంపియన్ అయ్యేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. అంటూ సాగే వాయిస్ ఓవర్ నెటిజన్స్‌ను ఆకర్షిస్తోంది. 
 
ఇక చివరగా.. ఆటలో ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. అంటూ డైలాగ్ వదిలారు. గని సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ టీజర్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తుండడం విశేషం. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.