1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Naga Babu and Varun Tej enjoy Ind vs Pak match

టీమిండియా ఘోర పరాజయం.. ఎక్కడ లెగ్గు పెడితే అక్కడే ఓటమే

Naga Babu
టీ 20 వరల్డ్‌ కప్‌ మొదటి మ్యాచ్‌‌లోనే టీమిండియా ఘోర పరాజయం పాలైంది. అందులోనూ దాయాది పాకిస్థాన్‌ జట్టు చేతిలో టీమిండియా ఓడిపోవడంతో… క్రికెట్‌ లవర్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే.. టీమిండియా ఓటమి సెగ మెగా బ్రదర్‌ నాగబాబుకు కూడా తాకింది. మెగా బద్రర్‌ నాగబాబును సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.
 
నిన్న ఇండియా మరియు పాకిస్థాన్ మ్యాచ్‌ చూసేందుకు నాగబాబు స్టేడియానికి వెళ్లడమే ఇందుకు కారణం. భారత్‌ ఓడిపోవడంతో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. "ఎక్కడ లెగ్గు పెడితే అక్కడే ఓటమే" అంటూ మీమ్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.
 
ప్రజారాజ్యంలో చిరంజీవి, జనసేన పార్టీలో పవన్‌ కళ్యాణ్‌, మా అర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌‌ను ఇలా ఎవరికి సపోర్ట్ చేసినా.. ఓడిపోతున్నారని ట్వీట్లు చేస్తున్నారు. కాగా.. నిన్న భారత్‌ మరియు పాక్‌ మ్యాచ్‌ కోసం నాగబాబు, వరుణ్‌ తేజ్‌ దుబాయ్‌ వెళ్లారు.
తర్వాతి కథనం
పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమికి కారణాలు ఏంటంటే...