మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (14:02 IST)

వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని అనేక ప్రాంతాలు చాలా మేరకు నీటి మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 
 
ఇదిలావుంటే, ఈ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ముంపు బాధితులను తక్షణం సహాయక పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. అలాగే, సహాయ చర్యల్లో ఎక్కడా రాజీలేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయినట్టు కలెక్టర్లకు వెల్లడించారు. 
 
ముఖ్యంగా వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. వర్షాల తర్వాత కూడా సీజనల్ వ్యాధులతో అంటు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వరదల కారణంగా ప్రజా రవాణా స్తంభించిన నేపథ్యంలో ప్రత్యామ్నయ సౌకర్యాలు చూసుకోవాలని కోరారు.