శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (08:20 IST)

తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం - నేడు తెలంగాణాలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం తీవ్ర వాయుగుండంగా మారడంతో శుక్రవారం రాష్ట్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ అల్పపీడన ప్రభావం కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని తెలిపారు. 
 
ముఖ్యంగా దక్షిణ ఏపీ - ఉత్తర తమిళనాడు మధ్య ఉన్న ఈ అల్పపీడనం నైరుతిని ఆనుకుని పశ్చి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో బలపడి వాయుగుండంగా మారిందని తెలిపింది. ఇది శుక్రవారం ఉదయం ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటొచ్చని తెలిపింది. 
 
దీని ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, పాలమూరు, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఆది, సోమవారాల్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.