మంగళవారం, 25 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2025 (15:59 IST)

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Monalisa
Monalisa
కుంభమేళా మోనాలిసా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ సైన్ చేసిన ఈ వైరల్ గర్ల్.. ఇప్పుడు సౌత్‌లో కూడా అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా మలయాళ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. పి. బిను వర్గీస్ దర్శకత్వం వహిస్తున్న నాగమ్మ సినిమా హీరోయిన్‌గా ఎంపికైంది. 
 
ఇందులో నీలతామర (2009) ఫేమ్ నటుడు కైలాష్ హీరోగా నటిస్తున్నారు. మంగళవారం పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు మేకర్స్. అక్టోబర్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. కొచ్చిలో జరిగిన ఈ పూజ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సిబి మలయిల్ హాజరయ్యారు.
 
ఇకపోతే.. మోనాలిసాతో తొలి సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటాను, హీరోయిన్‌గా అవకాశం కల్పిస్తానని నమ్మబలికి ఓ యువతిపై పలు మార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు సనోజ్ మిశ్రా. 
 
మాట వినకపోతే.. వారి అసభ్య వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. డైరెక్టర్‌ను అరెస్ట్ చేశారు.