బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (20:07 IST)

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

Monalisa
Monalisa
మహా కుంభమేళాలో బాగా ఫేమస్ అయిన మోనాలిసాను గురించి అందరికీ తెలిసింది. పూసలు అమ్ముకునేందుకు వచ్చి సెలబ్రిటీగా మారిన మోనాలిసా ఒకరు. ఈ తేనెకళ్ల సుందరి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా, మీడియా, పత్రికలు ఎక్కడ చూసినా తనే కనిపించింది. దీంతో ఆమెకు ఏకంగా సినిమా ఆఫర్ ఇస్తున్నట్లు ఓ డైరెక్టర్ కూడా ప్రకటించాడు. ఈ క్రమంలోనే మోనాలిసాను గుర్తుపట్టలేనంతగా ఆమె రూపాన్ని మార్చేశారు మేకప్ ఆర్టిస్ట్. 
 
పెద్ద కళ్లతో, ప్రత్యేకమైన అందంతో ఆకట్టుకునే మోనాలిసా ఈ కొత్త లుక్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. 
 
మోనాలిసా కేవలం తన అందంతోనే కాదు, నటనతోనూ మెప్పిస్తోంది. ఆమె చేస్తున్న రీల్స్‌లో నటన కూడా క్రమంగా మెరుగుపడుతోంది. ఆమె లుక్ చూసి ఆమెకు లైక్స్ వెల్లువల్లా వచ్చాయి.