నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే
బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్ లో తేనెకళ్ల సుందరి మోనాలిసా భోంస్లే పడిపోయిందనీ, అతడి వద్ద సినిమాను నిర్మించేంత డబ్బు లేదని నిర్మాత జితేంద్ర నారాయణ్ అన్నారు. మోనాలిసాకి వచ్చిన క్రేజును సొంతం చేసుకునేందుకు సనోజ్ ప్రయత్నిస్తున్నారనీ, లేదంటే ఆమెను సినిమాల్లో నటింపజేయకుండా బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎందుకు తిప్పుతున్నాడంటూ ప్రశ్నించారు. మోనాలిసాను ట్రాప్ లో పడేశాడంటూ ఆరోపించారు.
దీనిపై మోనాలిసా స్పందించింది. తనను ఎవరూ ట్రాప్ లో పడేయలేరనీ, తనతో పాటు తన పెదనాన్న, సోదరి నిత్యం వుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో నటన నేర్చుకుంటున్నట్లు చెప్పింది. దర్శకుడు సనోజ్ మిశ్రా ఎంతో మంచివారనీ, తనను కూతురు మాదిరిగా చూసుకుంటున్నారని వెల్లడించింది.