Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?
అత్యాచారం కేసులో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. మహా కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసా అనే యువతికి ఇతడు ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. మోనాలిసా సినిమా ఆఫర్ వచ్చిందని హ్యాపీగా వున్న తరుణంలో సనోజ్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సనోజ్ అరెస్ట్ కావడంతో, మోనాలిసా భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా సనోజ్ మిశ్రాపై ఓ బాలిక ఫిర్యాదు చేసింది. ఆమె నటనపై ఆసక్తి చూపుతూ హీరోయిన్ అవ్వాలనుకుంది. కానీ, ఈ ఆశను క్యాష్ చేసుకోవాలని చూసిన సనోజ్, ఆమెకు సినిమాలో ఛాన్స్ ఇస్తానని మోసపుచ్చి, అనేకసార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనతో శారీరకంగా కలవకపోతే సినిమా ఛాన్సులు ఇవ్వనని బెదిరించి లోబరుచుకున్నాడని.. ఇంకా ఆత్మహత్య కూడా చేసుకుంటానని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది.
ఈ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి, అతని మీద ఉన్న ఆధారాలను బలంగా ఉంచి, కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో, నబీ కరీం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.