సోమవారం, 10 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మార్చి 2025 (13:04 IST)

45 రోజుల్లో రూ.30 కోట్లు- యోగి నోట పింటూ సక్సెస్ స్టోరీ.. ప్రధానిని కలుస్తాడట! (video)

Boatman Pintu
Boatman Pintu
మహాకుంభమేళాలో ఒక పడవలు నడిపే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.30 కోట్లు సంపాదించాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం ట్రెండింగ్‌లో వుంది. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌ సమీపంలోని అరైల్‌ గ్రామానికి చెందిన వ్యక్తి పింటూ మహ్రా. వీరి కుటుంబం పడవలు నడిపే వృత్తిలో ఉంది. 
 
తన కుటుంబంతో కలిసి అతడు 45 రోజుల్లోనే రూ.30 కోట్లు సంపాదించాడు. పింటూ సక్సెస్‌ స్టోరీని ఏకంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీ వేదికగా వెల్లడించడం విశేషం. పింటూ అంతకు ముందు ఒక్కో బోటుపై రోజుకు రూ.1000 నుంచి రూ.2000 సంపాదించేవాడు. 
 
కానీ మహా కుంభమేళాలో మాత్రం రోజుకు రూ.50,000 నుంచి రూ.52,000 ఆర్జించాడు. దీంతో వాళ్లు కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాడు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుక స్థానికంగా ఉపాధి అవకాశాలు సృష్టిస్తోంది. చిరు వ్యాపారుల దగ్గర నుంచి బడా సర్వీస్‌ ప్రొవైడర్ల వరకు ప్రతీ ఒక్కరూ ఎంతో లబ్ధి పొందుతారు. 
 
అలాంటి వారిలో పింటూ మహ్రా కూడా లబ్ధిపొందాడు. ఇందుకోసం లక్షలాది మందిని నదిని దాటించేందుకు పడవలను దింపాడు. అద్దెకు దింపిన పడవలను నడిపేందుకు వ్యక్తుల్ని నియమించాడు. తద్వారా తనకే ఎక్కువ పుణ్యం లభించివుంటుందని.. ఎందుకంటే చాలామంది పుణ్యస్నానమాచరించేందుకు సాయం అందించానని వెల్లడించాడు. 
 
త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తానని పింటూ మహ్రా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక 30 కోట్ల రూపాయల సంపాదనకు పింటూ రూ.9కోట్లు పన్నుగా చెల్లించనున్నాడని.. మిగిలిన డబ్బుతో మొత్తం ఆదాయంలో పడవ నడపడానికి అయ్యే ఖర్చు, పడవ నడిపేవారి జీతం, ఇతర ఖర్చులు పోయినా పింటూను కోటీశ్వరుడి చేసింది మహా కుంభమేళానే.