మంగళవారం, 15 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (10:56 IST)

కుంభమేళాతో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందంటున్న సీఎం యోగి.. ఎలా?

yogi adityanath
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో 45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళాలో ఒక కుటుంబం ఏకంగా రూ.30 కోట్లు సంపాదించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే, ఈ కుంభమేళా మహోత్సవం అనేక మందికి ఎంతో కొంత ఆర్థికంగా లాభపడిందన్నారు. ఓ కుటుంబం 130 పడవలు నడిపి రూ.30 కోట్లు అర్జించినట్టు తెలిపారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారంటూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలపై సీఎం యోగి పై విధంగా స్పందించారు. 
 
తాను ఒక పడవ నిడిపే వ్యక్తి విజయగాథను మీతో పంచుకుంటాను. ఆ కుటుంబానికి 130 ఉన్నాయని, ఒక్కో పడవతో గరిష్టంగా రూ.52 వేల వరకు సంపాదించారని తెలిపారు. 45 రోజుల్లో ఒక్కో పడవతో రూ.23 లక్షలు చొప్పున సంపాదించారని, మొత్తంగా 130 పడవలతో రూ.30 కోట్ల వరకు అర్జించినట్టు సీఎం వివరించారు. 
 
ఎలాంటి అవాంతరాలు లేకుండా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించామని యోగి తెలిపారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా జరగలేదన్నారు. కుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం రూ.7500 కోట్లు ఖర్చు చేయగా దాదాపు రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని సీఎం సభకు తెలిపారు. హోటల్ పరిశ్రమ రూ.40 వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసర రంగానికి రూ.33  వేల కోట్లు, రవాణాకు రూ.1.5 లక్షల కోట్ల మేర ఆదాయం లభించినట్టు సీఎం యోగి తెలిపారు. ఈ యేడాది జీడీపీ వృద్ధికి ఈ కుంభమేళా ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.