బుధవారం, 3 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2025 (21:54 IST)

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan singh
Pawan singh
భోజ్‌పురి పవర్ స్టార్‌ పవన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ అంజలి నడుమును తాకడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై రెండు రోజులుగా మౌనంగా ఉన్న అంజలి, తాజాగా ఒక సంచలన వీడియోను విడుదల చేసి ఆవేదనను వ్యక్తపరిచింది. 
 
లక్నోలో జరిగిన ఈవెంట్‌లో పవన్ సింగ్ తనను అసభ్యంగా తాకిన విషయాన్ని అంజలి వివరించింది. మొదట అది పొరపాటుగా జరిగిందని, బ్లౌజ్ ట్యాగ్ ఏమైనా బయటికి వచ్చిందేమోనని తాను భావించానని చెప్పింది. కానీ, తర్వాత అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యానని పేర్కొంది. 
 
ఈ ఘటనపై ఎందుకు వెంటనే స్పందించలేదని అడిగిన వారికి ఆమె సమాధానమిస్తూ, ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులు పవన్ సింగ్ పలుకుబడి గురించి బెదిరించారని, ఇలాంటివి సహజమేనని చెప్పడంతో తాను సైలెంట్‌గా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం నెటిజన్లు అంజలికి మద్దతుగా నిలుస్తున్నారు.