ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (20:58 IST)

హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం (video)

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని తెంచుకున్న తర్వాత హీరోయిన్ సమంత దశ తిరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై దృష్టిసారించిన  సమంత... వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలో తన పారితోషికాన్ని కూడా పెంచేశారు. 
 
ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. స్నేహితులతో కలిసి విదేశాలకు చక్కర్లు కొడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత. తాజాగా సామ్ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది.
 
ఈ నెల గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్పీకర్‏గా వ్యవహరించే అవకాశాన్ని సమంత దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ వేడుకలో స్పీకర్‏గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. 
 
ఇక సమంతతోపాటు.. బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్, డైరెక్టర్ అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది.