మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (17:21 IST)

చైత‌న్య ఇంటిలోనే స‌మంత‌!

Samantha- Rohini
స‌మంత‌, చైత‌న్య విడాకుల విష‌యం తెలిసిందే. వారిద్ద‌రూ విడిపోయారు. అయితే ఈ వివాదానికి దూరంగా కొద్దిరోజుల‌పాటు విహార‌యాత్ర‌కు స‌మంత వెళ్ళింది. అవ‌న్నీ పూర్తిచేసుకుని తాజాగా అమామాస్య‌కు ముందుగా హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది. చైత‌న్య‌తో గ‌డిపిన విల్లాలోనే త‌ను వుంటుంది. ఇంటిలోని ఇంటీరియ‌ల్ ప‌నులు రోహిణి అనే డిజైన‌ర్ చూసుకుంటుంది. ఆమెతోపాటు చిన్న కుక్క‌పిల్ల‌ను ఎత్తుకుని ఇంటి వివరాల‌ను తెలియ‌జేస్తూ స‌మంత పోస్ట్ చేసింది.
 
అయితే చైత‌న్య కొత్త‌గా ఓ ఇల్లును కొనుగోలుచేశాడు. అన్నీ బాగుంటే ఇద్ద‌రూ అందులోని రావాల్సివుంది. కానీ ఇంకా ఆకొత్త ఇంటిప‌నులు పూర్తికాలేదు. అందుకే అవ‌న్నీ అయ్యాక దీపావ‌ళి త‌ర్వాత ఆ ఇంటిలోకి వెల్ళ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం త‌ను ఓ స్టార్ హోట‌ల్‌లో వుంటున్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. స్నేహితుల ద‌గ్గ‌ర‌కు వెళ్ళినా ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణ వుంటుంద‌ని త‌లంచిన‌ట్లు అనిపిస్తోంది. కొద్దిరోజులు ఇంటిప‌నులు పూర్త‌య్యాక త‌ను కొత్త ఇంటిలోకి మ‌కాం మార‌తాడు. అయితే స‌మంత వున్న విల్లా ఇప్పుడు చైతూ కొత్త ఇల్లు కూడా ద‌గ్గ‌ర‌గా వుండ‌డం విశేషం.